నిజంనిప్పులాంటిది

May 26 2023, 20:33

తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ..

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:45

పార్లమెంటు ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

న్యూఢిల్లీ,

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే.. దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ భవనాన్ని ప్రధానికి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సచివాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్‌ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ వేశారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ద్వారా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్‌ తన పిల్‌లో పేర్కొన్నారు.

ప్రధానిని, ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతేనని.. కార్యనిర్వహణకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రపతి పేరు మీదే తీసుకుంటారని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడమంటే అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా.. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వచ్చేదే లేదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన విపక్ష నేతలు తమ వాగ్దాడిని కొనసాగించారు.

ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘మిస్టర్‌ మోదీ.. పార్లమెంటు ప్రజలు నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం. మీ ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి పార్లమెంటరీ వ్యవస్థనే నాశనం చేసింది. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కోవడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ చేశారు.

ఇక.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం మన దేశ బహుళత్వానికి, భిన్నత్వానికి నిదర్శనమని.. పార్లమెంటరీ సాంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఒక నియంతృత్వ ప్రభుత్వ వైఖరికి ప్రతిస్పందన అని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ వ్యాఖ్యానించారు. ‘‘వందేభారత్‌ రైళ్ల నుంచి పార్లమెంటు భవనం దాకా.. అన్నింటినీ ప్రధానే ప్రారంభించాలి. కొవిడ్‌ టీకాల సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫొటోనే వేయాలి. ఏ శాఖ నిర్వహించిన పనికైనా క్రెడిట్‌ ఆయనకే ఇవ్వాలి.

ఈ తరహా మెగెలోమేనియా (తనను తాను అందరికన్నా అధికుడుగా భావించుకునే తత్వం).. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడే నియంతల తీరుకు బండగుర్తు’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే నిప్పులు చెరిగారు. వారి వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. మే 28న పార్లమెంటు ప్రారంభోత్సవానికి విచ్చేసి విపక్షాలు తమ విశాల హృదయాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము అంటే తమకు గౌరవం ఉందని.. రాష్ట్రపతి పదవిని తాము రాజకీయాల్లోకి లాగదల్చుకోలేదని స్పష్టం చేశారు.

నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:43

గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ కేసు నమోదు

గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ కేసు నమోదయింది. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో యాక్సిడెంట్ ఘటన శుక్రవారంనాడు చోటు చేసుకుంది.

స్వీఫ్ట్ డిజైర్ కారు (Swift DZire Car TS15EZ0795) ఓ బాలుడిని ఢీ కొట్టింది. కారు నడిపిన సూడాన్ దేశస్తుడు. అనంతరం కారుతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు కారును పట్టుకున్నారు. కోపాద్రిక్తులైన వారు కారును ధ్వంసం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నడిపి బలుడుని ఢీ కొట్టిన సూడాన్ దేశస్తుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:41

సెల్లార్ లో పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌‌లోని ఓ సెల్లార్‌లో పాప మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ పాప మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిన్న హయత్‌నగర్‌ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టిన రెండున్నర ఏళ్ల పాప మీది నుంచి కారు వెళ్లగా.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.

అయితే.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.

పాప మృతికి కారణమైన కారు వివరాలను పోలీసులు గుర్తించారు. TS07 JR 9441 నెంబరు గల కారు.. లెక్చరర్స్ కాలనీ బాలాజీ ఆర్కేడ్ నాలుగో ఫ్లోర్ రెసిడెన్స్‌ అడ్రస్‌తో.. కేషమోని స్వప్న పేరుతో రిజిస్టర్ అయింది.

అయితే స్వప్న.. ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో పోలీస్ క్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. కారును నడిపింది మాత్రం ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎక్సైజ్ ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. హరిరామకృష్ణపై కేసు పెట్టకుండా పోలీసులు కేవలం సీఆర్పీసీ 41 నోటీసులిచ్చి పంపించేశారు. అయితే.. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించటంపై పాప కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయాలంటూ పాప తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

పాపను చూడకుండా హరిరామకృష్ణ నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా పోలీసులు హరిరామకృష్ణను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి పంపించారంటూ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప హత్యకు కారణం అయిన హరిరామకృష్ణను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:36

Avinashreddy: అవినాష్‌రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది..

ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:58

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర చేసింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటోంది.

రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. మూడు వారాల నుంచి మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది.

దీంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు.

వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్‌ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు.

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:56

గ్రూప్-1 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ‌ హైకోర్టు

నిరాక‌రించింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

గ్రూప్-1, 2, 3, 4 నియామక పరీక్షలకు మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించలేదని ఆయా అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ విచారణ నిర్వహించింది. అయితే.. తన కుమార్తె కూడా గ్రూప్ 1 అభ్యర్థి అయినందున తాను విచారించలేనని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని తెలిపారు.

దీంతో ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మరో నాలుగు వారాల‌కు హైకోర్టు వాయిదా వేసింది...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:55

హయతికి వేధింపులు: డీసీపీపై లాయర్ పాల్ సత్యనారాయణ సంచలన ఆరోపణలు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, డింపుల్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. డింపుల్ హయతిపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. డింపుల్.. డీసీపీ కారు కవర్ తీసేసిందని ఎఫ్ఐఆర్ లో రాశారని, నిజంగా డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ ఉంటే బయటపెట్టండని సవాల్ విసిరారు ఆమె తరుపు న్యాయవాది పాల్ సత్య నారాయణ. ఈ వివాదంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

డీసీపీ అబద్దాలు చెబుతున్నారరన్నారు పాల్ సత్యనారాయణ. తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నాడని.. ఇంత జరుగుతున్నా డ్రైవర్ ఎందుకు బయటకు రావడంలేదని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు కావాలనే బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్‌‌లో పెట్టారని.. చేసిన తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేశారని న్యాయవాది పాల్ ఆరోపించారు.

డీసీపీ ప్రవర్తన బాగాలేకనే డింపుల్ గతంలో ఆయనకు వార్నిం కూడా ఇచ్చిందని.. ఆ కోపంతోనే డింపుల్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు లాయర్ సత్య నారాయణ. ఇక డింపుల్ ఇంట్లోకి కూడా ఎవరెవరో వస్తున్నారని, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి ఆమెను భయపెడుతున్నారని.. భయంతో ఆమె బయటకు కూడా రావడంలేదని చెప్పుకోచ్చారు. దీనిపై డింపుల్ ఫిర్యాదు చేస్తే కూడా తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు.

ఒక ఐపీఎస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనన్న పాల్ సత్యనారాయణ.. డీసీపీతో పాటు అతని డ్రైవర్ పైన న్యాయ పరమైన యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. కాగా, ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్‌పై కేసు కూడా నమోదైంది. డింపుల్ హయతి నివాసం ఉంటున్న భవనంలోనే ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. మరోవైపు, డింపుల్ కూడా డీసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:53

వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు? తెలంగాణలో అమలు కానుందా❓️

ఆడపిల్లలను కన్నవారు అల్లుడికి వరకట్నం ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారంగా కొనసాగుతుంది. పెళ్లిలో కచ్చితంగా ఎంతో కొంత నగదును వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఇస్తారు.

అయితే ఇటీవల హైకోర్టు విడాకుల విషయం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం వరకట్నం తీసుకునేవారికి డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా, తెలంగాణలో కూడా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేశారు.

రెండేళ్ల కిందటే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదనను అవసరమైన ప్రోటోకాల్‌లను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:49

నేడు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం

హాజరుకానున్న అన్ని శాఖల మంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.